కరోనా కేసుల కంటే మాపైన కేసులే ఎక్కువగా ఉన్నాయ్

రాష్ట్రంలో ఉన్న కరోనా కేసుల కంటే టీడీపీ నేతలపైనే కేసులు ఎక్కువగా ఉన్నాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ప్రతిపక్షాన్ని అణిచివేయడానికే అధికార పార్టీ తన [more]

Update: 2021-05-14 00:42 GMT

రాష్ట్రంలో ఉన్న కరోనా కేసుల కంటే టీడీపీ నేతలపైనే కేసులు ఎక్కువగా ఉన్నాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ప్రతిపక్షాన్ని అణిచివేయడానికే అధికార పార్టీ తన సమయాన్ని వెచ్చిస్తుందన్నారు. కరోనా కట్టడి చేయడానికి వైసీపీ ప్రభుత్వం ఎలాంటి శ్రద్ధ చూపడం లేదని అచ్చెన్నాయుడు అన్నారు. చంద్రబాబు నుంచి దిగువ స్థాయి నేతల వరకూ కేసులు నమోదు చేస్తున్నారన్నారు. తాము ఫిర్యాదు చేయడానికి వెళితే వారిపైనే ఎదురు కేసులు పెడుతున్నారని అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు చెప్పినట్లు నడుచుకుంటున్న పోలీసులపై తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత చర్యలు తప్పవని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.

Tags:    

Similar News