ఇదంతా జగన్ నాన్ సీరియస్ తోనే?
కరోనా వైరస్ ను తొలి నుంచి జగన్ నాన్ సీరియస్ గా తీసుకున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ప్రజలకు ధైర్యాన్ని ఇవ్వకుండా సహజీవనం చేయాల్సిందేనని [more]
కరోనా వైరస్ ను తొలి నుంచి జగన్ నాన్ సీరియస్ గా తీసుకున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ప్రజలకు ధైర్యాన్ని ఇవ్వకుండా సహజీవనం చేయాల్సిందేనని [more]
కరోనా వైరస్ ను తొలి నుంచి జగన్ నాన్ సీరియస్ గా తీసుకున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ప్రజలకు ధైర్యాన్ని ఇవ్వకుండా సహజీవనం చేయాల్సిందేనని జగన్ అనడం దారుణమన్నారు. పారాసెట్మాల్, బ్లీచింగ్ చల్లితే కరోనా పోతుందని జగన్ చెప్పారన్నారు. కరోనా విషయంలో దేశంలో ఏపీ ఐదో స్థానంలో ఉందని అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. కరోనా మరణాలపై జగన్ ప్రభుత్వం అబద్ధాలాడుతుందని అన్నారు. తమ పార్టీ వత్తిడి తేవడంతోనే గ్లోబల్ టెండర్లను పిలిచారని అచ్చెన్నాయుడు అన్నారు. వ్యాక్సిన్ తయారు చేసే కంపెనీలకు కూడా కులాన్ని ఆపాదించడం జగన్ కే చెల్లించదన్నారు. ఇప్పటికైనా కరోనా నియంత్రణపై జగన్ దృష్టి పెట్టాలని అచ్చెన్నాయుడు కోరారు.