జగన్ మోసం చేయడం వల్లనే?

అధికారంలోకి వచ్చిన జగన్ కు రాష్ట్రంలో పదివేల ఉద్యోగాలే కన్పించాయా అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. నిరుద్యోగులకు పాదయాత్రలో ఇచ్చిన హామీని మరిచిపోయావా? అని [more]

;

Update: 2021-07-06 04:41 GMT

అధికారంలోకి వచ్చిన జగన్ కు రాష్ట్రంలో పదివేల ఉద్యోగాలే కన్పించాయా అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. నిరుద్యోగులకు పాదయాత్రలో ఇచ్చిన హామీని మరిచిపోయావా? అని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. జగన్ మోసం చేయడం వల్లనే నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అచ్చెన్నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఇవన్నీ ప్రభుత్వ హత్యలేనని, కర్నూలు జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి గోపాల్ కుటుంబానికి ఇరవై ఐదు లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

Tags:    

Similar News