ఆదినారాయణరెడ్డిపై కేశవరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్

కేశవరెడ్డి విద్యాసంస్థల ఛైర్మన్ కేశవరెడ్డి మాజీ మంత్రి ఆదినారా‍యణరెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన ఆస్తులన్నింటిని ఆదినారాయణరెడ్డి కొల్లగొట్టారని ఆయన ఆరోపించారు. 800 కోట్ల తన విలువైన [more]

Update: 2020-10-02 14:04 GMT

కేశవరెడ్డి విద్యాసంస్థల ఛైర్మన్ కేశవరెడ్డి మాజీ మంత్రి ఆదినారా‍యణరెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన ఆస్తులన్నింటిని ఆదినారాయణరెడ్డి కొల్లగొట్టారని ఆయన ఆరోపించారు. 800 కోట్ల తన విలువైన ఆస్తులను ఆదినారాయణ రెడ్డి, శ్రీ చైతన్య సంస్థలు కలసి కబ్జా చేశారన్నారు. విజయవాడ – గుంటూరు ల మధ్య 50 కోట్ల విలువైన ఆస్తులను కూడా వారు స్వాధీనం చేసుకున్నారన్నారు. కాగా కేశవరెడ్డి ఆదినారాయణరెడ్డికి వియ్యంకుడు. అయితే ఆయన ఆరోపణల్లో నిజం లేదని ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. కేశవరెడ్డి వ్యాఖ్యలపై తాను స్పందించాల్సిన అవసరం లేదన్నారు.

Tags:    

Similar News