జాతీయ రహదారి దిగ్భంధనం
అమరావతి రాజధాని రైతులు తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తున్నారు. ఇప్పటి వరకూ సకల జనుల సమ్మె తో ఆందోలన చేస్తున్న రాజధాని ప్రాంత గ్రామాల రైతులు [more]
అమరావతి రాజధాని రైతులు తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తున్నారు. ఇప్పటి వరకూ సకల జనుల సమ్మె తో ఆందోలన చేస్తున్న రాజధాని ప్రాంత గ్రామాల రైతులు [more]
అమరావతి రాజధాని రైతులు తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తున్నారు. ఇప్పటి వరకూ సకల జనుల సమ్మె తో ఆందోలన చేస్తున్న రాజధాని ప్రాంత గ్రామాల రైతులు ఈ నెల 7వ తేదీన ఏడో నెంబరు జాతీయ రహదారిని దిగ్బంధనం చేయాలని నిర్ణయించారు. కాకాని వద్ద ఈ నెల ఏడోతేదీన జాతీయ రహదారిపై రాకపోకలను నిలిపివేయనున్నారు. ఈ విషయాన్ని జేఏసీ నేతలు ప్రకటించారు. ఈ నెల 6వ తేదీన జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టెంట్ గ్రూపు ఇచ్చిన నివేదికపై ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ చర్చించనుంది. అలాగే ఈ నెల 8వ తేదీన ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలోనే రాజధానిపై నిర్ణయం తీసుకోనుండటంతో రాజధాని రైతులు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు.