కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డేకు కడప ఉక్కు సెగ తగిలింది. కడప జిల్లా పర్యటనకు వచ్చిన అనంత్ కుమార్ హెగ్డే కాన్వాయ్ ను రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ(ఆర్సీపీ) అడ్డుకుంది. కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఇంతలో ఓ మహిళా కార్యకర్త మంత్రి కాన్వాయ్ పై బూటు విసిరింది. దీంతో పోలీసులు బలవంతంగా ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. కడప ఉక్కు కోసం 365 రోజులుగా ఆందోళనలు చేస్తుంటే ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదని ఆర్సీపీ నేతలు ఆరోపించారు. ఉదృక్తత నేపథ్యంలో మంత్రి కాన్వాయ్ కొంతసేపు ఆగాల్సి వచ్చింది.