Big Breaking : భారత్ లో తొలి హెచ్ఎంపీవీ వైరస్ కేసు.. బెంగళూరులో
భారత్ లో తొలి హెచ్ఎంపీవీ కేసు నమోదయింది. బెంగళూరు నగరంలో ఈ కేసు నమోదయినట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి.;
భారత్ లో తొలి హెచ్ఎంపీవీ కేసు నమోదయింది. బెంగళూరు నగరంలో ఈ కేసు నమోదయినట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. చైనాలో విజృంభిస్తున్న హెచ్ఎంపీవీ కేసు బెంగళూరులో నమోదయింది. ఒక చిన్నారికి హెచ్ఎంపీవీ వైరస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. రక్త పరీక్షల్లో హెచ్ఎంపీవీ వైరస్ నమోదయినట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి.
ఎనిమిది నెలల చిన్నారికి...
హెచ్ఎంపీవీ వైరస్ ఎనిమిది నెలల చిన్నారికి సోకినట్లు నిర్ధారణ కావడంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమయింది. ఆ చిన్నారితో కాంట్రాక్ట్ అయిన వారికి కూడా వైద్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే ప్రభుత్వం కూడా అప్రమత్తమయింది. తొలి కేసు బెంగళూరు నగరంలోనే అప్రమత్తం కావడంతో పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు కూడా అప్రమత్తం కావాల్సి ఉంది
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App నౌ