సంచయిత ట్వీట్ తో రగిలిపోతున్నారే

మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ సంచయిత గజపతిరాజుపై రాష్ట్ర బీజేపీ నేతలు మండిపడుతున్నారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు సంచయిత పాల్పడుతున్నారంటూ బీజేపీ రాష్ట్రనేతలు కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదు చేశారు. [more]

;

Update: 2020-03-07 12:19 GMT

మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ సంచయిత గజపతిరాజుపై రాష్ట్ర బీజేపీ నేతలు మండిపడుతున్నారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు సంచయిత పాల్పడుతున్నారంటూ బీజేపీ రాష్ట్రనేతలు కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదు చేశారు. మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం దేవస్థానం ఛైర్మన్ గా నియమితులైన తర్వాత ముఖ్యమంత్రి జగన్, ఎంపీ విజయసాయిరెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ సంచయిత చేసిన ట్వీట్ ను బీజేపీ రాష్ట్ర నాయకత్వం తప్పుపట్టింది. జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనను కూడా సంచయిత సమర్థించారని, ఆమె పై పార్టీ పరంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర నేతలు కేంద్ర నాయకత్వాన్ని కోరారు.

Tags:    

Similar News