Maharashtra : మాజీ హోంమంత్రి అరెస్ట్

మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ అరెస్ట్ అయ్యారు. ఆయనను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. మనీలాండరింగ్ కేసులో అనిల్ దేశ్ ముఖ్ ను అరెస్ట్ [more]

Update: 2021-11-02 03:51 GMT

మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ అరెస్ట్ అయ్యారు. ఆయనను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. మనీలాండరింగ్ కేసులో అనిల్ దేశ్ ముఖ్ ను అరెస్ట్ చేశారు. దాదాపు 12 గంటల విచారణ అనంతరం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆయనను అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. ముంబయిలోని బార్ అండ్ రెస్టారెంట్ల నుంచి అనిల్ దేశ్ ముఖ్ హోంమంత్రిగా ఉన్న సమయంలో పెద్దయెత్తున వసూళ్లకు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. దీంతో ఆయన హోంమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

సీబీఐ విచారణ….

అనిల్ దేశ్ ముఖ్ పై వచ్చిన అవినీతి ఆరోపణలపై ముంబయి హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని ఆయన ఖండించినా, ఈడీ విచారణలో మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో ఆయనను అరెస్ట్ చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు.

Tags:    

Similar News