ఏపీ అసెంబ్లీలో గందరగోళం…. స్పీకర్ ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. వరదనష్టంపై చర్చ జరగాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. దీంతో స్పీకర్ తమ్మినేని సీతారాం టీడీపీ సభ్యులపై ఆగ్రహం [more]

Update: 2020-12-01 04:36 GMT

ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. వరదనష్టంపై చర్చ జరగాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. దీంతో స్పీకర్ తమ్మినేని సీతారాం టీడీపీ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమనుకుంటున్నారు మీరు? కూర్చోండి. ఇక్కడి నుంచి డిక్టేట్ చేస్తే నేనేమీ చేయలేను అని తమ్మినేని సీతారాం ఆగ్రహించారు. పోడియంను చుట్టుముట్టడం హక్కు ఎలా అవుతుందని ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయినా టీడీపీ సభ్యులు మాత్రం పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేస్తూనే ఉన్నారు.

Tags:    

Similar News