సాయంత్రానికి పీఆర్సీ రిపోర్ట్?
ఉద్యోగుల పీఆర్సీపై ఏపీ ప్రభుత్వం కసరత్తు పూర్తయింది. హైలెవెల్ కమిటీ దీనిపై పూర్తి స్థాయి నివేదిక రూపొందించింది.
ఉద్యోగుల పీఆర్సీపై ఏపీ ప్రభుత్వం కసరత్తు పూర్తయింది. చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ నేతృత్వంలోని హైలెవెల్ కమిటీ దీనిపై పూర్తి స్థాయి నివేదిక రూపొందించింది. ఈ సాయంత్రం ముఖ్యమంత్రి జగన్ కు చీఫ్ సెక్రటరీ పీఆర్సీ నివేదికను ఇవ్వనున్నారు. ఉద్యోగ సంఘాలకు కూడా ఇచ్చే అవకాశముంది.
ఉద్యోగ సంఘాలతో...
పీఆర్సీపై ముఖ్యమంత్రి జగన్ రేపు ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించే అవకాశముందని తెలుస్తోంది. పీఆర్సీ తో పాటు 71 డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఉద్యోగ సంఘాలు ఈ నెల 7వ తేదీ నుంచి ఏపీలో ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. దశల వారీ కార్యాచరణను ప్రకటించారు. మొత్తం మీద పీఆర్సీ నివేదిక ఫైనల్ అయింది. సాయంత్రం అధికారికంగా పీఆర్సీపై ప్రకటన వచ్చే అవకాశముంది. మరి దీనిపై ఉద్యోగ సంఘాల నుంచి ఎలాంటి అభిప్రాయం వ్యక్తమవుతుందన్నది చూడాలి.