నేటి నుంచి అమరావతి కేసుల విచారణ

రాజధాని అమరావతి కేసులపై నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరగనుంది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను సవాల్ చేస్తూ దాఖలయిన పిటీషన్ల పై నేటి [more]

;

Update: 2021-03-26 01:57 GMT

రాజధాని అమరావతి కేసులపై నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరగనుంది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను సవాల్ చేస్తూ దాఖలయిన పిటీషన్ల పై నేటి నుంచి హైకోర్టులో విచారణ ప్రారంభం కానుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ కేసులను విచారించనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే విచారణ జరపపున్నారు. చీఫ్ జస్టిస్ గా పనిచేసిన మహేశ్వరి బదిలీ కావడంతో కొన్ని రోజులుగా అమరావతి కేసుల విచారణ నిలిచిపోయిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News