హుజూర్ లో లెజెండ్

తెలంగాణలోని ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారిన హుజూర్ నగర్ ఉప ఎన్నికలో సినీ హీరో ఏపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రచారానికి రానున్నారు. టీడీపీ నుంచి అక్కడ [more]

;

Update: 2019-10-07 13:22 GMT

తెలంగాణలోని ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారిన హుజూర్ నగర్ ఉప ఎన్నికలో సినీ హీరో ఏపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రచారానికి రానున్నారు. టీడీపీ నుంచి అక్కడ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చావా కిరణ్మయికి మద్దతుగా ప్రచారం చేస్తారు బాలకృష్ణ. స్థానిక నేతల ఒత్తిడి మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు అక్కడ అభ్యర్ధిని బరిలోకి దించిన విషయం తెలిసిందే. ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న కిరణ్మయికి సినీ హీరో నందమూరి బాలకృష్ణ ప్రచారం చేయడం ద్వారా పార్టీ కేడర్ లో కొత్త జోష్ వస్తుందని పార్టీ అధినేత చంద్రబాబు అంచనా వేస్తున్నారు. దీంతో నందమూరి బాలకృష్ణ హుజూర్ నగరలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. బాలకృష్ణ ఈ నెల 13 నుంచి 18వరకు హుజూర్ నగర్ లో పర్యటించనున్నారు. ప్రచార సమయంలో నిజయోజకవర్గం పరిధిలో రోడ్‌షోలు, బహిరంగ సభలు ఏర్పాటుచేయనున్నారు.

 

 

Tags:    

Similar News