నేడు అపెక్స్ కౌన్సిల్ భేటీ.. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు

అపెక్స్ కౌన్సిల్ సమావేశం నేడు జరగనుంది. కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ లు హాజరుకానున్నారు. ప్రధానంగా ఇరు [more]

;

Update: 2020-10-06 02:42 GMT

అపెక్స్ కౌన్సిల్ సమావేశం నేడు జరగనుంది. కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ లు హాజరుకానున్నారు. ప్రధానంగా ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలపై నేడు అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో చర్చించనున్నారు. ఆంధ్రప్రదేశ్ చేపట్టిన పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు సామర్థ్యం పెంపుపై తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. అయితే జగన్ నేరుగా ఢిల్లీలో జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి హాజరుకానుండగా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొననున్నారు.

Tags:    

Similar News