బాబు దిగ్భంధంపై రాజు సీరియస్

ఎయిర్ పోర్టులో చంద్రబాబును అడ్డుకోవడం హేయమైన చర్య అని మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు అభిప్రాయపడ్డారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఎక్కడైనా తిరిగే హక్కు ఉందన్నారు. ఒక [more]

Update: 2020-02-27 09:00 GMT

ఎయిర్ పోర్టులో చంద్రబాబును అడ్డుకోవడం హేయమైన చర్య అని మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు అభిప్రాయపడ్డారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఎక్కడైనా తిరిగే హక్కు ఉందన్నారు. ఒక పార్టీ అధినేతను ప్రజల వద్దకు వెళ్లకుండా అడ్డుకోవడమేంటని అశోక్ గజపతిరాజు ప్రశ్నించారు. మంత్రులే చంద్రబాబు పర్యటనను అడ్డుకోవాలని పిలుపు నివ్వడం సిగ్గు చేటని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేదా? అన్న అనుమానం వస్తుందన్నారు. అమరావతి రైతుల త్యాగాలను అవమానించవద్దన్నారు. ఆంధ్రప్రదేశ్ ను మూడు ముక్కలు చేయవద్దని అశోక్ గజపతి రాజు కోరారు.

Tags:    

Similar News