కర్ఫ్యూ సమయంలోనూ గ్యాంగ్ ల హల్ చల్

హైదరాబాద్ లో అర్ధరాత్రి రెండు గాంగ్స్ రోడ్డు మీద పడి కొట్టుకు ఉన్నాయి. కర్ఫ్యూ ఉన్నప్పటికీ గ్యాంగ్ వార్ జరగడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. వందలాదిమంది యువకులు రోడ్డు [more]

Update: 2020-05-04 02:54 GMT

హైదరాబాద్ లో అర్ధరాత్రి రెండు గాంగ్స్ రోడ్డు మీద పడి కొట్టుకు ఉన్నాయి. కర్ఫ్యూ ఉన్నప్పటికీ గ్యాంగ్ వార్ జరగడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. వందలాదిమంది యువకులు రోడ్డు మీదికి వచ్చి ఒకరు ఒకరి పై ఒకరు దాడి చేసుకున్నారు. పాతబస్తీలోని మోయిన్ బాగ్ సమీపంలో ఈ ఘర్షణ చోటు చేసుకుంది. ఈ దాడిలో దాదాపు పది మందికి పైగా గాయపడ్డారు . అర్ధరాత్రి సమయంలో గల్లీ లో కూర్చొని యువకులు మాట్లాడుకుంటున్నారు. యువకుల మధ్య మాట మాట పెరిగి పోయింది. దీంతో ఒకరిపై ఒకరు దాడి కి చేసుకున్నారు. ఇది కాస్తా పెద్దదయింది. ఇంతలో ఒక యువకుడు వచ్చి కర్ర తో దాడి చేశారు. మరొక వర్గానికి చెందిన యువకులు వచ్చి కర్రలతో కొట్టారు. దీంతో రెండు గ్యాంగులు రోడ్డు మీద పడి ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం నెలకొంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గాయపడ్డ వారిని అందరిని కూడా ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. యువకులు ఘర్షణ పడ్డ పై పోలీసు సీరియస్ గా వ్యవహరిస్తున్నారు. ఘర్షణ పడిన వారందరినీ పోలీసులు గుర్తించారు. అక్కడ ఉన్న సీసీ కెమెరాలతో పాటు ఘర్షణ జరుగుతున్న సమయంలో తీసిన వీడియో ని ఇప్పటికే పోలీసులు సేకరించారు. దీని ఆధారంగా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

Tags:    

Similar News