Ayyanna : అయ్యన్న పై వరస కేసులు

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడిపై వరస కేసులు నమోదయ్యాయి. ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయింది. గుంటూరు అరండల్ పేటలో అయ్యన్నపాత్రుడిపై కేసు [more]

;

Update: 2021-09-24 04:49 GMT

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడిపై వరస కేసులు నమోదయ్యాయి. ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయింది. గుంటూరు అరండల్ పేటలో అయ్యన్నపాత్రుడిపై కేసు నమోదయింది. ఇటీవల నరసరావు పేటలో ముఖ్యమంత్రి ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ కేసు నమోదయింది. న్యాయవాది వేముల ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసును నమోదు చేశారు. గుంటూరు అరండల్ పేట్ పోలీస్ స్టేషన్ తో పాటు నకరికల్లు పోలీస్ స్టేషన్లలోనూ అయ్యన్న పాత్రుడిపై కేసులు నమోదయ్యాయి.

Tags:    

Similar News