కీలక సమావేశానికి జీవీఎల్ వస్తున్నారంటేనే?
భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు సమావేశం అయ్యాయి. విజయవాడలో సమావేశమైన ఇరు పార్టీల నేతలు భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నాయి. కాగా బీజేపీ తరుపున ఏపీ పార్టీ [more]
భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు సమావేశం అయ్యాయి. విజయవాడలో సమావేశమైన ఇరు పార్టీల నేతలు భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నాయి. కాగా బీజేపీ తరుపున ఏపీ పార్టీ [more]
భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు సమావేశం అయ్యాయి. విజయవాడలో సమావేశమైన ఇరు పార్టీల నేతలు భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నాయి. కాగా బీజేపీ తరుపున ఏపీ పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి సునీల్ దేవధర్, కన్నా లక్ష్మీనారాయణ, పురంద్రేశ్వరి, జీవీఎల్ నరసింహారావులు హాజరయ్యారు. జనసేన పార్టీ తరుపున పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ లు హాజరయ్యారు. దాదాపు నాలుగు గంటల పాటు వీరి సమావేశం జరగనుంది. కాగా టీడీపీని పూర్తిగా వ్యతిరేకించే జీవీఎల్, సోము వీర్రాజు, పురంద్రీశ్వరిలు ఈ సమావేశానికి హాజరు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. జనసేన, బీజేపీతో పొత్తు ఎలా ఉన్నప్పటికీ టీడీపీ, వైసీపీ విషయంలో కఠినంగా వ్యవహరించేందుకు జీవీఎల్ ఈ సమావేశంలో కీలకంగా మారతారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.