జగన్ కు ఆ రెండూ లేవు

రాజధాని తరలింపు అనేది రైతు సమస్య కాదని, అభివృద్ధి సమస్య అని, ఐదు కోట్ల మంది ఆంధ్రుల సమస్య అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ [more]

Update: 2019-12-25 07:39 GMT

రాజధాని తరలింపు అనేది రైతు సమస్య కాదని, అభివృద్ధి సమస్య అని, ఐదు కోట్ల మంది ఆంధ్రుల సమస్య అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. తుళ్లూరులో ఆందోళన చేస్తున్న రైతులకు బీజేపీ నేతలు సంఘీభావం ప్రకటించారు. ఈ ముఖ్యమంత్రికి అనుభవంతో పాటు అవగాహన లేదన్నారు కన్నా లక్ష్మీనారాయణ. ఆ రెండూ లేకపోవడం వల్లనే ఇటువంటి సమస్యలు వస్తున్నాయన్నారు. రాజధానిని ఇక్కడి నుంచి తరలిస్తామంటే అంగీకరించే ప్రసక్తి లేదని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. రాజధాని కోసం రైతులు తమ భూములను త్యాగం చేశారన్నారు. రాజధాని అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. విశాఖలో సచివాలయం, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తే అభివృద్ధి జరగదన్నారు. రాజధాని నిర్మాణంలో చంద్రబాబు ప్రభుత్వం కాలయాపన చేసిందన్నారు.

Tags:    

Similar News