తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ గతంలో కంటే పుంజుకుంటుందని, గతం కంటే ఎక్కువ ఓట్లు, సీట్లు సాధిస్తుందని ఆ పార్టీ నేతలు అంచనా వేశారు. అయితే, టీఆర్ఎస్ కు అనుకూలంగా ఏర్పడిన నిశబ్ధ విప్లవంలో బీజేపీ సోదిలో లేకుండా పోయింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా.లక్ష్మణ్ ముషిరాబాద్ లో ఓటమి అంచున ఉంది. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్ 10 వేల మెజారిటీతో దూసుకుపోతున్నారు. కిషన్ రెడ్డికి కంచుకోట వంటి అంబర్ పేట స్థానంలోనూ ఆయన వెనుకబడ్డారు. ఆయనపై టీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ ఆధిక్యతలో ఉన్నారు. గోషామహాల్ లో రాజాసింగ్ పై టీఆర్ఎస్ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సైతం ఉప్పల్ లో మూడో స్థానానికే పరిమితమయ్యారు. చింతల రాంచంద్రారెడ్డి కూడా ఒటమి బాటలో ఉన్నారు. మొత్తానికి గత ఎన్నికల్లో బీజేపీ నుంచి విజయం సాధించిన ఐదుగురూ వెనుకంజలో ఉన్నారు.