పెయిడ్ ఆర్టిస్టులంటారా? అంటే ఊరుకుంటారా?

చంద్రబాబుకు తన సామాజిక వర్గం తప్ప ఎవరూ అక్కరలేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలను చంద్రబాబు పెయిడ్ ఆర్టిస్టులనడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర [more]

;

Update: 2020-02-27 12:57 GMT

చంద్రబాబుకు తన సామాజిక వర్గం తప్ప ఎవరూ అక్కరలేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలను చంద్రబాబు పెయిడ్ ఆర్టిస్టులనడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని చంద్రబాబు వ్యతిరేకించడంతోనే ఈరోజు ఎయిర్ పోర్టులో అంతటి వ్యతిరేకతను చంద్రబాబు ఎదుర్కొనాల్సి వచ్చిందన్నారు. అమరావతిని పరిరక్షిస్తానని చెప్పి రాష్ట్రమంతటా తిరిగితే ఉత్తరాంధ్రలో ఊరుకుంటారా? అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. చంద్రబాబు రెండు రోజుల నుంచి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్నారు. వైసీపీ నేతల సంగతి తేలుస్తానంటూ సవాల్ విసిరారన్నారు. చంద్రబాబు స్వార్థ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. విశాఖ ప్రజల ఆగ్రహం ఏంటో ఆయన చవిచూడాల్సి వచ్చిందన్నారు. మూడు రాజధానులను వ్యతిరేకించిన చంద్రబాబుపై విశాఖ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్నారు.

Tags:    

Similar News