పక్కా ఎవిడెన్స్ తోనే అచ్చెన్న అరెస్ట్

పక్కా ఎవిడెన్స్ తో ప్రభుత్వం అరెస్ట్ లు చేస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అచ్చెన్నాయుడు విషయంలో టీడీపీ ఆరోపణలు సరికాదన్నారు. మొన్నటి దాకా తమ అవినీతిపై [more]

;

Update: 2020-06-12 12:54 GMT

పక్కా ఎవిడెన్స్ తో ప్రభుత్వం అరెస్ట్ లు చేస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అచ్చెన్నాయుడు విషయంలో టీడీపీ ఆరోపణలు సరికాదన్నారు. మొన్నటి దాకా తమ అవినీతిపై నిగ్గుతేల్చమని సవాల్ విసిరిన నాయకులు ఇప్పుడు అరెస్ట్ చేస్తే కులాన్ని ఆపాదించడమేంటని ప్రశ్నించారు. గత ప్రభుత్వ దోపిడీలపై తమ ప్రభుత్వం విచారణలు జరుపుతుందన్నారు. ఇక రోజుకో కేసు వస్తూనే ఉంటుందన్నారు. అచ్చెన్నాయుడు అంశంపై టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తుందని చెప్పారు. రాజధాని భూముల విషయంలోనూ కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని బొత్స సత్యనారాయణ తెలిపారు.

Tags:    

Similar News