బాబువి పనికి మాలిన మాటలు… ఏం చెబుతావు?

మోసం చేయడం అంటే చంద్రబాబు కు పేటెంట్ అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని కోరారు. విశాఖకు రాజధాని [more]

;

Update: 2020-08-06 07:16 GMT

మోసం చేయడం అంటే చంద్రబాబు కు పేటెంట్ అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని కోరారు. విశాఖకు రాజధాని చంద్రబాబు వద్దంటుంటే అక్కడ టీడీపీ నేతలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కేవలం 29 గ్రామాలకే అభివృద్ధి చేయలా? అని నిలదీశారు. జగన్ మాట ఇస్తే తప్పరని చెప్పారు. అమరావతిలో శాసన రాజధాని ఉంటుందన్నారు. చంద్రబాబు ఒక ప్రాంతంవైపు మొగ్గు చూపుతుంటుంటే ఏ ముఖం పెట్టుకుని ఆ పార్టీలో ఎమ్మెల్యేలు ఉంటారన్నారు. రాజధానిగా అమరావతి ఎంపికలో శివరామకృష్ణన్ కమిటీ పాత్ర లేదని కేంద్రం చెప్పిందన్నారు. రాజధాని అమరావతి పై చంద్రబాబు వితండవాదం చేస్తున్నారన్నారు. ప్రతి రెండురోజులకొకసారి వచ్చి ఏం చెబుతావు? ఏం చూస్తావు? అని బొత్స వ్యంగంగా అన్నారు. పనికి మాలిన మాటలు మాట్లాడవద్దని బొత్స చంద్రబాబుపై ఫైరయ్యారు.

Tags:    

Similar News