చేతులు ముడుచుకుని కూర్చోం.. బొత్స వివాదాస్పద కామెంట్స్

తమ రాజకీయ లబ్దికోసమే తెలంగాణ నేతలు జల వివాదాలను సృష్టిస్తున్నారని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. తమ ప్రభుత్వం చేతులు ముడుచుకుని కూర్చోబోమన్నారు. తెలంగాణ మంత్రులు [more]

;

Update: 2021-06-30 06:33 GMT

తమ రాజకీయ లబ్దికోసమే తెలంగాణ నేతలు జల వివాదాలను సృష్టిస్తున్నారని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. తమ ప్రభుత్వం చేతులు ముడుచుకుని కూర్చోబోమన్నారు. తెలంగాణ మంత్రులు పరుష పదజాలాన్ని ఉపయోగించడాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ తప్పుపట్టారు. తమ ప్రభుత్వం ప్రాజెక్టుల విషయంలో స్పష్టమైన వైఖరితో ఉందని చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరి అధికారాలు వారికి ఉంటాయన్నది తెలంగాణ నేతలు గుర్తుంచుకోవాలని బొత్స సత్యనారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నీటి ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో తమ వ్యూహాలు తమకు ఉన్నాయని బొత్స అన్నారు.

Tags:    

Similar News