Botsa : మంత్రి వర్గ విస్తరణపై బొత్స రెస్పాన్స్

మంత్రి వర్గ విస్తరణపై సీనియర్ నేత బొత్స సత్యనారాయణ స్పందించారు. మంత్రి వర్గ విస్తరణ ముఖ్యమంత్రి ఇష్టమని అన్నారు. ఆయన ఇష్టమొచ్చినట్లు మంత్రివర్గంలో మార్పులు చేసుకోవచ్చాన్నారు. ముఖ్యమంత్రి [more]

;

Update: 2021-09-26 08:22 GMT

మంత్రి వర్గ విస్తరణపై సీనియర్ నేత బొత్స సత్యనారాయణ స్పందించారు. మంత్రి వర్గ విస్తరణ ముఖ్యమంత్రి ఇష్టమని అన్నారు. ఆయన ఇష్టమొచ్చినట్లు మంత్రివర్గంలో మార్పులు చేసుకోవచ్చాన్నారు. ముఖ్యమంత్రి నిర్ణయాలకు అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని బొత్స సత్యనారాయణ అన్నారు. దీంతో పాటు పవన్ కల్యాణ్ పై కూడా బొత్స ఫైర్ అయ్యారు. సినిమా టిక్కెట్ల ధరలు ఇష్టమొచ్చినట్లు పెంచితే ఊరుకుంటామా? అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. సినీ పెద్దలు ఆన్ లైన్ టిక్కెట్ల విక్రయానికి అంగీకరించారన్నారు. సినిమా టిక్కెట్ల విషయంలో నియంత్రణ లేకుండా పోతుందన్నారు. జీఎస్టీ వంటి పన్నలును స్ట్రీమ్ చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమని బొత్స సత్యనారాయణ తెలిపారు.

Tags:    

Similar News