రెడీ అవుతున్న జనసేనాని రథం
జనసేన అధినేత పవన్ కల్యాణ్ యాత్రకు బస్సు సిద్ధమవుతుంది. హైదరాబాద్ లో ఒక వర్క్ షాపులో ఈ బస్సును సిద్ధం చేస్తున్నారు.;
జనసేన అధినేత పవన్ కల్యాణ్ యాత్రకు బస్సు సిద్ధమవుతుంది. హైదరాబాద్ లో ఒక వర్క్ షాపులో ఈ బస్సును సిద్ధం చేస్తున్నారు. ఎన్టీఆర్ చైతన్య రధం పోలి ఉండేలా ఈ బస్సును తీర్చి దిద్దుతున్నారు. వచ్చే నెల నుంచి పవన్ కల్యాణ్ బస్సు యాత్ర చేయడానికి రెడీ అవుతున్నారు. బస్సు ద్వారా రాష్ట్రంలో పర్యటించి పార్టీని బలోపేతం చేసేందుకు సిద్ధమవుతున్నారు. దశలవారీగా ఈ యాత్ర ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెలాఖరుకు ఈ బస్సును తయారు చేసి మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉంచాలని పవన్ ఆదేశించినట్లు తెలిసింది.
తిరుపతి నుంచి....
తొలుత తిరుపతి నుంచి ప్రారంభించాలన్న యోచనలో పవన్ కల్యాణ్ ఉన్నారని తెలిసింది. తిరుపతిలో పర్యటన మొదలు పెట్టి తొలుత కోస్తాంధ్రలో ఆయన పర్యటించాలని భావిస్తున్నారు. ఆ తర్వాత ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రకు రెండో దశలో పర్యటిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చివరిగా రాయలసీమలో ఆయన పర్యటించి తిరిగి యాత్రను తిరుపతిలోనే ముగించాలన్న నిర్ణయంతో పవన్ కల్యాణ్ ఉన్నారని చెబుతున్నారు. బస్సులో అన్నీ వసతులను సమకూర్చారు. ప్రత్యేకంగా సౌండ్ సిస్టమ్ ను ఏర్పాటు చేశారు.