తెలంగాణలో కమ్యూనిస్ట్ పార్టీలతో కాంగ్రెస్‌ మంతనాలు.. పొత్తుపై క్లారిటీ

తెలంగాణలో ఎన్నికల సందడి మొదలైపోయింది. ఇప్పటి నుంచి వివిధ పార్టీల నేతలు వ్యూహాలు..;

Update: 2023-08-28 10:02 GMT

తెలంగాణలో ఎన్నికల సందడి మొదలైపోయింది. ఇప్పటి నుంచి వివిధ పార్టీల నేతలు వ్యూహాలు, ప్రతి వ్యూహాలు రచిస్తున్నారు. ఇక అటు అధికార పార్టీ బీఆర్‌ఎస్‌, ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీ, టీడీపీలు సైతం ఎవరి వ్యూహరచనలో వారున్నారు. ఇక హైదరాబాద్‌ క్యాంప్ కార్యాలయంలో ఆదివారం సీపీఐ నేతలు కూనంనేని సాంబశివరావు, పల్లం వెంకట్‌రెడ్డి, చాడ వెంకటరెడ్డితో కీలక సమావేశం అయ్యారు. కమలం పార్టీని ఓడించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్లేందుకు ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. ఇదే లక్ష్యంతో కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకునేందుకు ఎలాంటి ఇబ్బంది లేదని కమ్యూనిటిస్ట్‌ పార్టీలే చెబుతున్నాయి. ఇప్పుడు హస్తం పార్టీ మముఖ్య నేతలతో చర్చలు ప్రాథమిక దశలో ఉన్నా.. త్వరలోనే పూర్తి క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇండియా కూటమిలో కీలకంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్‌, కమ్యూనిస్ట్‌లు:

ఇక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇండియా కూటమిలో కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జీ మాణిక్‌రావుఠాక్రే కమ్యూనిస్ట్‌ పార్టీలతో మధ్యవర్తిత్వం ప్రారంభించారు. భాగ్యనగరంలో తన క్యాంప్‌ కార్యాలయంలో సీపీఐ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. ఇతర పార్టీలకు అధికారం ఇవ్వకుండా ఎలా ముందుకెళ్లాలనేది చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. బీజేపీని ఓడించేందుకు ఎలా ముందుకెళ్లాలనే చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునేందుకు ఎలాంటి సంకోచం లేదని, గౌరవ ప్రదమైన సీట్లు కేటాయిస్తే పొత్తుకు సిద్దమని సీపీఐ నేతలు తెలిపినట్లు సమాచారం. కాగా త్వరలోనే కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల మధ్య మరోసారి ఫైనల్ చర్చలు జరిగే అవకాశాలున్నాయని సమాచారం.

ఇదిలా ఉండగా, చర్చల తర్వాత సీపీఐ నేత కూనంనేని సాంబశివావు వివరాలు మీడియా ముందు తెలిపారు. కాంగ్రెస్‌తో పొత్తు కోసం తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రేతో చర్చలు జరిగాయని, జరిగిన చర్చలు సానుకూలంగానే ఉన్నాయని అన్నారు. అయితే పొత్తున విషయంలో సాగదీత ధోరణి ఏ మాత్రం పనికిరాదని ఆయన స్పష్టం చేసినట్లుగా ఆయన పేర్కొన్నారు. ఒకటి,రెండు రోజుల్లో పూర్తి వివరాలు తేలనున్నాయని అన్నారు.

Tags:    

Similar News