Ys viveka murder case: స్పీడ్ పెంచిన సీబీఐ

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు స్పీడ్ పెంచారు. గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.

Update: 2023-04-14 04:09 GMT

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు స్పీడ్ పెంచారు. కడపకు సీబీఐ అధికారులు చేరుకున్నారు. గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఆయనను అరెస్ట్ చేసే అవకాశముందని చెబుతున్నారు. ఉదయ్ కుమార్ రెడ్డి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా అనుమానిస్తున్నారు. హత్యజరిగిన రోజు ఉదయ్ కుమార్ రెడ్డి వైఎస్ భాస్కర్‌ రెడ్డి ఇంట్లో ఉన్నారని గుర్తించింది.

గూగుల్ టేక్ అవుట్...
గూగుల్ టేక్ అవుట్ ఆధారంగా హత్యజరిగిన రోజు ఉదయ్ కుమార్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఇంట్లో ఉన్నట్లు గుర్తించిన సీీబీఐ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. గుజ్జుల ఉదయ్ కుమార్ రెడ్డి పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డికి ప్రధాన అనుచరుడుగా ఉన్నారు. హత్య జరిగిన రోజు అవినాష్, శివశంకర్ రెడ్డితో పాటుగా హత్య జరిగిన ప్రాంతానికి ఉదయ్ కుమార్ రెడ్డి కూడా వెళ్లినట్లు సీబీఐ అధికారులు చెబుతున్నారు. వివేకా మృతదేహానికి ఉదయ్ కుమార్ రెడ్డి తండ్రి జయప్రకాష్ రెడ్డి బ్యాండేజీ కట్టినట్లు కూడా అనుమనిస్తున్నారు.


Tags:    

Similar News