జమిలి ఎన్నికలొస్తున్నాయ్… సిద్ధంగా ఉండండి

జమిలి ఎన్నికలు వస్తున్నాయని, సిద్ధంగా ఉండాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గం నేతలతో ఆయన మాట్లాడారు. దేశంలో జమిలి ఎన్నికలు వస్తాయని, పార్టీ [more]

Update: 2020-10-02 14:08 GMT

జమిలి ఎన్నికలు వస్తున్నాయని, సిద్ధంగా ఉండాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గం నేతలతో ఆయన మాట్లాడారు. దేశంలో జమిలి ఎన్నికలు వస్తాయని, పార్టీ క్యాడర్ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో వైసీపీని మట్టికరిపించేలా పోరాడాలని చంద్రబాబు కోరారు. పార్టీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం చేసే అరాచకాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని చంద్రబాబు కోరారు.

Tags:    

Similar News