రాష్ట్రంలో అంతా జే ట్యాక్స్ నడుస్తుంది

ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు సొమ్మును ప్రభుత్వం కొల్లగొడుతుందని, జే ట్యాక్స్ రూపంలో దోపిడీకి దిగిందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల [more]

;

Update: 2021-02-05 02:01 GMT

ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు సొమ్మును ప్రభుత్వం కొల్లగొడుతుందని, జే ట్యాక్స్ రూపంలో దోపిడీకి దిగిందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల జేబులు లూటీ చేసే కార్యక్రమం మొదలయిందన్నారు. ప్రతి గ్రామంలో వైసీపీ గూండాలు రెచ్చిపోయి దోచుకుంటున్నారన్నారు. జేట్యాక్స్ పేరుతో ప్రజలను దోచుకుంటున్న ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. అన్ని వస్తువుల ధరలు మండిపోతున్నాయని, ఇరవై నెలల్లోనే ప్రభుత్వం ప్రజలపై 70 వేల కోట్ల భారాన్ని మోపారని చంద్రబాబు విమర్శించారు.

Tags:    

Similar News