ఎన్నికల కమిషన్ కూడా బాధ్యతగా వ్యవహరించాలి
ఎన్నికల కమిషన్ కూడా హుందాగా వ్యవహరించాలని టీడీపీ అధినేత చంద్రబాబు కోరారు. అనేక చోట్ల వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నా, రౌడీయిజం చేస్తున్నా చూస్తూ ఊరుకోవడమేంటన్నారు. ఎస్ [more]
;
ఎన్నికల కమిషన్ కూడా హుందాగా వ్యవహరించాలని టీడీపీ అధినేత చంద్రబాబు కోరారు. అనేక చోట్ల వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నా, రౌడీయిజం చేస్తున్నా చూస్తూ ఊరుకోవడమేంటన్నారు. ఎస్ [more]
ఎన్నికల కమిషన్ కూడా హుందాగా వ్యవహరించాలని టీడీపీ అధినేత చంద్రబాబు కోరారు. అనేక చోట్ల వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నా, రౌడీయిజం చేస్తున్నా చూస్తూ ఊరుకోవడమేంటన్నారు. ఎస్ నుంచి సీఐ వరకూ అందరూ తమ పార్టీ నేతలను బెదిరిస్తున్నారన్నారు. ఎన్నికల కమిషన్ కు పుంగనూరు, మాచర్ల విషయంలో ఎన్నికల కమిషనర్ కు వందల కొద్ది లేఖలు రాశామని అయినా స్పందన లేదన్నారు. బాధ్యత లేదా ఎవరికి అని చంద్రబాబు ప్రశ్నించారు. వైసీపీ నేతలకు బానిసలుగా మారొద్దని అధికారులను హెచ్చరించారు. జీతాలు ఇచ్చేది ప్రజలు అని చంద్రబాబు పేర్కొన్నారు. తాత్కాలిక ప్రలోభాలకు లొంగవద్దని అన్నారు. ఇరవై నెలల్లో ఎంత వ్యతిరేకత వచ్చినా వైసీపీ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవడం లేదన్నారు. ఇందిరాగాంధీతోనే తాము పోరాడామన్నారు. ఒక్క ఛాన్స్ అడిగి అధికారంలోకి వచ్చారని, ఇదే చివరి ఛాన్స్ అని చంద్రబాబు అన్నారు. చెల్లెలకు వెన్నుపోటు పొడిచిన చరిత్ర జగన్ ది అని అన్నారు. ఒక పద్ధతి లేని వ్యక్తి ఈ ముఖ్యమంత్రి అని అన్నారు. పాలనపై ప్రజలు తిరగబడే పరిస్థితికి వచ్చారన్నారు.