చాలారోజుల తర్వాత విశాఖకు చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు త్వరలో విశాఖలో పర్యటించనున్నారు. ఆయన దాదాపు ఏడాదిన్నర తర్వాత విశాఖకు రానున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ [more]
;
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు త్వరలో విశాఖలో పర్యటించనున్నారు. ఆయన దాదాపు ఏడాదిన్నర తర్వాత విశాఖకు రానున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు త్వరలో విశాఖలో పర్యటించనున్నారు. ఆయన దాదాపు ఏడాదిన్నర తర్వాత విశాఖకు రానున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ నేత పల్లా శ్రీనివాస్ ఆమరణ దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. పల్లా శ్రీనివాస్ దీక్షకు సంఘీభావం తెలిపేందుకు చంద్రబాబు విశాఖకు రానున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రెండు, మూడురోజుల్లో చంద్రబాబు పర్యటన ఖరారు కానుందని తెలిసింది. చంద్రబాబు పర్యటన కోసం పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.