అధికారం శాశ్వతం కాదు.. గుర్తుంచుకో జగన్

అధికారం శాశ్వతం కాదని ఏపీ ముఖ్యమంత్రి జగన్ గుర్తుంచుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. జగన్ విపక్ష నేతలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారన్నారు. ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే [more]

;

Update: 2021-03-13 00:51 GMT

అధికారం శాశ్వతం కాదని ఏపీ ముఖ్యమంత్రి జగన్ గుర్తుంచుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. జగన్ విపక్ష నేతలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారన్నారు. ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే అపహాస్యం చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ ను చంద్రబాబు ఖండించారు. వైసీపీ అవినీతిని ప్రశ్నించినందుకే ఆయనపై అక్రమ కేసును ప్రభుత్వం నమోదు చేసిందన్నారు. కక్ష సాధింపులు మానుకుని ఇకనైనా జగన్ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని చంద్రబాబు హితవు పలికారు.

Tags:    

Similar News