బాబు ముందు బరస్ట్ అయిన తమ్ముళ్లు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముందు తెలుగుదేశం పార్టీ నేతలు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు పార్టీ నేతలతో చర్చించారు. అధికారంలో ఉన్నప్పుడు [more]

;

Update: 2021-03-16 01:05 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముందు తెలుగుదేశం పార్టీ నేతలు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు పార్టీ నేతలతో చర్చించారు. అధికారంలో ఉన్నప్పుడు క్యాడర్ ను పట్టించుకోక పోవడం వల్లనే ఈ పరిస్థిితి తలెత్తిందని ఎక్కువ మంది నేతలు చంద్రబాబు ఎదుట అభిప్రాయపడినట్లు తెలిసింది. అధికారం చేజారిన తర్వాత క్యాడర్ ను పట్టించుకున్నా ఫలితం లేదని వారు చంద్రబాబు తో అన్నారు. అయితే ఇకపై ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూస్తానని చంద్రబాబు నేతలకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News