రాజారెడ్డి రాజ్యాంగానికి వ్యాలిడిటీ మూడేళ్లే

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ నేతలపై అక్రమ కేసులు, కక్ష సాధింపు చర్యలు ఆగడం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అయితే అక్రమ కేసులకు భయపడే నేతలు [more]

;

Update: 2021-06-23 07:08 GMT

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ నేతలపై అక్రమ కేసులు, కక్ష సాధింపు చర్యలు ఆగడం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అయితే అక్రమ కేసులకు భయపడే నేతలు ఎవ్వరూ టీడీపీలో లేరని అన్నారు. అక్రమ కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటామని చంద్రబాబు తెలిపారు. రాజారెడ్డి రాజ్యాంగానికి ఇక మూడేళ్లే వ్యాలిడిటీ అని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ అక్రమ పద్ధతులను ప్రజలు గమనిస్తున్నారని, ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజు వస్తుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News