జగన్ ఖజానా గల గల.. సర్కార్ ఖజానా వెలవెల

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. జగన్ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ ఖజానా వెలవెలపోతుందని, జగన్ ఖజానా మాత్రం [more]

;

Update: 2021-07-14 08:00 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. జగన్ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ ఖజానా వెలవెలపోతుందని, జగన్ ఖజానా మాత్రం గల గలలాగుతున్నాయని చంద్రబాబు అన్నారు. భారతీ సిమెంట్స్ కళకళలాడుతుందన్నారు. ప్రజాధనాన్ని కొల్లగొడుతూ తన ఖజానాకు జగన్ తరలించుకుంటున్నారని చంద్రబాబు అన్నారు. తప్పుడు కేసులకు జగన్ భయపడేది లేదని చంద్రబాబు అన్నారు. జగన్ ప్రభుత్వం రైతులను నిండా ముంచుతుందని చంద్రబాబు విమర్శించారు. మాట తప్పడం, మడమ తిప్పడం జగన్ నైజమని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఢిల్లీ మెడలు వంచుతామని చెప్పి అక్కడకు వెళ్లి వంగి వంగి నమస్కారాలు చేస్తున్నారని చంద్రబాబు అన్నారు.

Tags:    

Similar News