జగన్ కు రాసిన లేఖలో చంద్రబాబు?
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. జీవో నెంబరు 217ను తక్షణమే రద్దు చేయాలని కోరారు. మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బతీసే [more]
;
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. జీవో నెంబరు 217ను తక్షణమే రద్దు చేయాలని కోరారు. మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బతీసే [more]
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. జీవో నెంబరు 217ను తక్షణమే రద్దు చేయాలని కోరారు. మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బతీసే విధంగా ఈ జీవో ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. దీనివల్ల మత్స్యకారులు ఆర్థికంగా నష్టపోతారని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో మత్స్యకారులకు అందుతున్న సంక్షేమ పథకాలన్నింటినీ నిలిపివేయడం పట్ల చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. కార్పొరేషన్ల ద్వారా కూడా బీసీలకు రుణాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే జీవో నెంబరు 217ను రద్దు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.