వైసీపీవి పచ్చి అబద్ధాలు

విద్యుత్తు సంస్కరణలను తానే తీసుకువచ్చానని తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీపీఏలపై వైెఎస్సార్ కాంగ్రెస్ [more]

Update: 2019-07-19 07:51 GMT

విద్యుత్తు సంస్కరణలను తానే తీసుకువచ్చానని తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీపీఏలపై వైెఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం నిజాలను వక్రీకరిస్తుందన్నారు. నిబంధనల మేరకే పీపీఏ లు జరిగాయని తెలిపారు. కొత్త రాష్ట్రమైన విద్యుత్తు అవసరాలను బట్టి పీపీఏలను కుదుర్చుకున్నామన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి ఏపీలో విద్యుత్తు కోతలు మొదలయ్యాయని ఎద్దేవా చేశారు చంద్రబాబు. అధిక ధరలకు కొనుగోలు చేసినందున ప్రభుత్వానికి మూడు వేల కోట్ల నష్టం వస్తుందని వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. కర్ణాటక ప్రభుత్వానికి జగన్ కు చెందిన విండ్ పవర్ కంపెనీ అధిక ధరలకు విద్యుత్తును విక్రయిస్తున్న విషయాన్ని చంద్రబాబు సభలో గుర్తు చేశారు. దీనికి వైసీపీ సభ్యులు అభ్యంతరం తెలిపారు.

Tags:    

Similar News