రెండు గంటలుగా ఎయిర్ పోర్టులోనే చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు  రెండు గంటలుగా రేణిగుంట ఎయిర్ పోర్టులోనే ఉన్నారు. ఆయనను పోలీసులు బయటకు అనుమతించలేదు. దీంతో ఎయిర్ పోర్ట్ లాంజ్ లో చంద్రబాబు [more]

Update: 2021-03-01 05:51 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రెండు గంటలుగా రేణిగుంట ఎయిర్ పోర్టులోనే ఉన్నారు. ఆయనను పోలీసులు బయటకు అనుమతించలేదు. దీంతో ఎయిర్ పోర్ట్ లాంజ్ లో చంద్రబాబు బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. “నేనేమైనా హత్య చేయడానికి వచ్చానా? పథ్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా చేశానయ్యా? ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. నన్ను తిరుపతిలోకి అనుమతించండి, నన్ను అనుమతించేవరకూ ఎయిర్ పోర్టులోనే ఉంటా” అని చంద్రబాబు పోలీసులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పోలీసులు అనుమతించకపోవడంతో చంద్రబాబు ఎయిర్ పోర్టు లాంజ్ లో నేలపై కూర్చుని నిరసన తెలుపుతున్నారు. చంద్రబాబు రాకకోసం ఎయిర్ పోర్టు బయట వేచి ఉన్న టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం మీద రేణిగుంట ఎయిర్ పోర్ట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Tags:    

Similar News