నిమ్మగడ్డకు చంద్రబాబు మరో లేఖ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు టీడీపీ అధినేత చంద్రబాబు మరో లేఖ రాశారు. టీడీపీ నేతలు పుట్టా సుధాకర్ యాదవ్, మల్లెల [more]

;

Update: 2021-03-09 02:02 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు టీడీపీ అధినేత చంద్రబాబు మరో లేఖ రాశారు. టీడీపీ నేతలు పుట్టా సుధాకర్ యాదవ్, మల్లెల లింగారెడ్డిలపై అక్రమ కేసులు నమోదు చేశారని ఆయన లేఖలో పేర్కొన్నారు. మైదుకూరు డీఎస్పీ విజయ్ కుమార్, సీఐ మధుసూదన్ గౌడ్, ఎస్ఐ సుబ్బారావులపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు తన లేఖలో డిమాండ్ చేశారు. ఓటర్లను ఓటు హక్కు వినియోగించుకోకుండా వీరు అడ్డుపడే అవకాశముందని, వీరిపై వెంటనే చర్యలు తీసుకోవాలని చంద్రబాబు తన లేఖలో కోరారు.

Tags:    

Similar News