23న విచారణకు హాజరు కావాలి.. మరి చంద్రబాబు?

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఏపీ సిఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు .అమరావతి భూముల కుంభకోణంలో చంద్రబాబు పై ఇప్పటికే కేసు నమోదైంది. అమరావతి భూముల [more]

;

Update: 2021-03-16 04:11 GMT

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఏపీ సిఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు .అమరావతి భూముల కుంభకోణంలో చంద్రబాబు పై ఇప్పటికే కేసు నమోదైంది. అమరావతి భూముల కుంభకోణం సంబంధించి కేసుకు సంబంధించి తమ ముందు హాజరు కావాలంటూ 41 సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసును హైదరాబాదులో ఉన్న చంద్రబాబు నాయుడు కి అందజేశారు. ఏపీ సిఐడి ఇవాళ హైదరాబాద్ లోని బంజారాహిల్స్లో ఉన్న చంద్రబాబు ఇంటికి వెళ్లారు. ఈ నెల 23వ తేదీన తమ ముందు హాజరై పూర్తి వివరాలు అందించాలని ఏపీ సిఐడి అధికారులు చంద్రబాబునాయుడికి నోటీసులు ఇచ్చారు. అమరావతి భూములు కొనుగోలు లో అక్రమాలు జరిగాయని సిఐడి కేసు నమోదు చేసింది. అంతేకాకుండా ఈ భూముల వ్యవహారంలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని అనుమానం వ్యక్తం చేస్తోంది. అయితే చంద్రబాబు ఈ నోటీసులు పై కోర్టును ఆశ్రయించే అవకాశముంది.

Tags:    

Similar News