సొంతగడ్డనే జగన్ కాపాడుకోలేక పోతున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అసమర్థత కారణంగానే రాయలసీమ పొలాలకు రావాల్సిన కృష్ణా జలాలు [more]

;

Update: 2021-07-05 12:32 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అసమర్థత కారణంగానే రాయలసీమ పొలాలకు రావాల్సిన కృష్ణా జలాలు సముద్రం పాలవుతున్నాయన్నరాు. శ్రీశైలం రిజర్వాయర్ ను ఖాళీ చేస్తుంటే సీఎం జగన్ కాలక్షేపం చేస్తున్నాని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఢిల్లీకి వెళ్లి ఎందుకు కేంద్ర మంత్రులను కలవడం లేదని ఆయన ప్రశ్నించారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే సెంటిమెంట్ ను రెచ్చగొడుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీశైలం నీటి హక్కులను కాపాడుకోలేక జగన్ రాయలసీమ గడ్డకు ద్రోహం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

Tags:    

Similar News