ఫోన్లు స్విచాఫ్ చేసి మరీ

మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆయన ఫోన్లు స్విచాఫ్ చేసి ఉన్నాయి. సీబీఐ అధికారులు అరెస్ట్ చేస్తారన్న ఉద్దేశ్యంతో చిదంబరం కన్పించకుండా పోయారు. ఐఎన్ఎక్స్ [more]

Update: 2019-08-21 03:52 GMT

మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆయన ఫోన్లు స్విచాఫ్ చేసి ఉన్నాయి. సీబీఐ అధికారులు అరెస్ట్ చేస్తారన్న ఉద్దేశ్యంతో చిదంబరం కన్పించకుండా పోయారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో సీబీఐ, ఈడీలు నోటీసులు జారీ చేయడంతో చిదంబరం ముందస్తు బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ చుక్కెదురు కావడంతో ఈరోజు సుప్రీంకోర్టులో పిటీషన్ వేయనున్నారు. సుప్రీంకోర్టులో తన ముందస్తు బెయిల్ పిటీషన్ పై తీర్పు వచ్చేంత వరకూ చిదంబరం బయటకు వచ్చే అవకాశం లేదు. మరోవైపు సీబీఐ అధికారులు ఆయన కోసం వెతుకులాటను ప్రారంభించారు

Tags:    

Similar News