బ్రేకింగ్ : ఢిల్లీలో మరో వారం లాక్ డౌన్ పొడిగింపు

ఢిల్లీలో మరో వారం రోజుల పాటు లాక్ డౌన్ పొడిగించినట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రేపటితో తొలి [more]

;

Update: 2021-04-25 06:40 GMT
బ్రేకింగ్ : ఢిల్లీలో మరో వారం లాక్ డౌన్ పొడిగింపు
  • whatsapp icon

ఢిల్లీలో మరో వారం రోజుల పాటు లాక్ డౌన్ పొడిగించినట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రేపటితో తొలి విడత లాక్ డౌన్ సమయం ముగియనుంది. దీంతో మరో వారం రోజుల పాటు లాక్ డౌన్ పొడిగించాల్సి వచ్చిందని అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. ఆక్సిజన్ , బెడ్స్ కొరతతో పాటు ఢిల్లీలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకోక తప్పింది కాదని అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ప్రజలు సహకరించాలని కేజ్రీవాల్ కోరారు. మే 3వ తేదీ ఉదయం 5 గంటల వరకూ ఢిల్లీలో లాక్ డౌన్ కొనసాగుతుందని ఆయన చెప్పారు.

Tags:    

Similar News