చిరు మళ్లీ జగన్ కు జై
మాజీ కేంద్ర మంత్రి, మెగాస్టార్ చిరంజీవి మరోసారి జగన్ నిర్ణయాన్ని స్వాగతించారు. మూడు రాజధానుల ప్రతిపాదన మంచి నిర్ణయమని చిరంజీవి ప్రశంసించారు. అధికార, పరిపాలన వికేంద్రీకరణతోనే అభివృద్ధి [more]
మాజీ కేంద్ర మంత్రి, మెగాస్టార్ చిరంజీవి మరోసారి జగన్ నిర్ణయాన్ని స్వాగతించారు. మూడు రాజధానుల ప్రతిపాదన మంచి నిర్ణయమని చిరంజీవి ప్రశంసించారు. అధికార, పరిపాలన వికేంద్రీకరణతోనే అభివృద్ధి [more]
మాజీ కేంద్ర మంత్రి, మెగాస్టార్ చిరంజీవి మరోసారి జగన్ నిర్ణయాన్ని స్వాగతించారు. మూడు రాజధానుల ప్రతిపాదన మంచి నిర్ణయమని చిరంజీవి ప్రశంసించారు. అధికార, పరిపాలన వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని చిరంజీవి అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరూ ఈ ప్రతిపాదనను స్వాగతించాలని చిరంజీవి కోరారు. ఆర్థిక అసమానతలను తొలగించాలన్నా,, ప్రాంతీయ అభివృద్ధి జరగాలన్నా మూడు రాజధానుల ప్రతిపాదన వల్ల సాధ్యమవుతుందని చిరంజీవి ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి అంతా హైదరాబాద్లోనే జరిగిందని, అందుకే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వచ్చిందని చిరంజీవి గుర్తు చేశారు. లక్షల కోట్లు అప్పు చేసి ఒక్క అమరావతిలోనే ఖర్చు చేస్తే మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏంటని చిరంజీవి ప్రశ్నించారు. పేద ప్రజల భవిష్యత్తుకు కూడా మూడు రాజధానుల ప్రతపాదన భరోసా ఇస్తుందన్నారు. కాగా ఇదే విషయంపై ఆయన సోదరుడు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మాత్రం వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు.