భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు

ఢిల్లీలో 14 కిలోల సిలిండర్ ధర (సబ్సిడి లేని)రూ.899.5 వద్ద స్థిరంగా ఉంది. ధర పెరిగిన తర్వాత 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ..;

Update: 2022-03-01 06:52 GMT
భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు
  • whatsapp icon

న్యూ ఢిల్లీ : గ్యాస్ ధరలు మళ్లీ పెరిగాయి. ఈసారి ఒక్కో సిలిండర్ పై రూ.105 వరకూ వడ్డించాయి చమురు కంపెనీలు అయితే ఇందులో వంటగ్యాస్ (డొమెస్టిక్) కు మాత్రం మినహాయింపు ఇచ్చారు. కమర్షియల్ ఎల్ పీజీ సిలిండర్ ధరలు మాత్రం అమాంతం పెరిగిపోయాయి. తాజాగా పెరిగిన ధరలను చూస్తే.. 19 కిలోల వాణిజ్య ఎల్ పీజీ సిలిండర్ ధరలు ఢిల్లీలో రూ.105 మేర పెరగగా.. కోల్ కతా లో ఒక్కో సిలిండర్ ధరపై రూ.108 పెరిగింది. 5 కిలోల కమర్షియల్‌ ఎల్‌పీజీ సిలిండర్‌ ధర కూడా 27 రూపాయలు పెరిగింది. పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి. సబ్సిడీ లేని 14 కిలోల సిలిండర్ ధర మాత్రం పెరగలేదు. వాటి ధరలు ఎప్పటిలాగే ఉన్నాయి.

ఢిల్లీలో 14 కిలోల సిలిండర్ ధర (సబ్సిడి లేని)రూ.899.5 వద్ద స్థిరంగా ఉంది. ధర పెరిగిన తర్వాత 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.2012గా ఉండగా.. 5 కేజీల సిలిండర్ ధర రూ.569కి పెరిగింది. కోల్‌కతాలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.2,095కి చేరుకుంది. ముంబై, చెన్నైలలో 19 కేజీల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు లో రూ.1963, రూ.2145.5కి పెరిగాయి. ఇంటి గ్యాస్ ధరలు పెంచకపోవడంతో సామాన్యుడికి కాస్త ఊరట లభించినా.. వాణిజ్య సిలిండర్ల ధరల పెంపు భారం రెస్టారెంట్లు, హోటళ్ల రూపంలో వారిపైనే పడనుంది.




Tags:    

Similar News