కీలక నిర్ణయాల దిశగా సోనియా
కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. జీ 23 నేతలకు పదవులు ఇవ్వాలని నిర్ణయించారు.
కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. జీ 23 నేతలకు పదవులు ఇవ్వాలని నిర్ణయించారు. ఆనంద్ శర్మను రాజ్యసభకు పంపాలని సోనియా నిర్ణయించారని చెబుతున్నారు. హర్యానా పీసీసీ చీఫ్ బాధ్యతలను భూపేందర్ సింగ్ కు అప్పగించాలని నిశ్చయించారు. మనీష్ తివారికి ఏఐసీసీలో కీలక పదవి ఇవ్వాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కపిల్ సిబాల్ విషయంలో మాత్రం సోనియా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.
జీ 23 నేతలకు....
కర్ణాటక రాష్ట్ర బాధ్యతలను గులాంనబీ ఆజాద్ కు అప్పగించాలని సోనియా నిర్ణయించారు. పార్టీలోనూ సంస్థాగతంగా మార్పులు, చేర్పులు చేయాలని, ఏఐసీసీతో పాటు పీసీసీ పదవులలో సయితం కొన్ని మార్పులు చేయాలని భావిస్తున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత జీ 23 నేతలు స్పీడ్ పెంచారు. గులాం నబీ ఆజాద్ ఇప్పటికే సోనియా గాంధీతో సమావేశమై పార్టీ బలోపేతంపై చర్చించారు. సోనియా నాయకత్వం కొనసాగాలని తాము కోరుకుంటున్నట్లు ప్రకటించారు.