షిర్డి సాయి ఆలయం మూసివేత
షిర్డీ సాయిబాబా ఆలయం రేపటి నుంచి నిరవధికంగా మూసివేయనున్నారు. సాయి జన్మస్థలం అభివృద్ధిపై రేగిన వివాదమే ఇందుకు కారణం. సాయిబాబా పత్రి అనే గ్రామంలో జన్మించారు. అయితే [more]
షిర్డీ సాయిబాబా ఆలయం రేపటి నుంచి నిరవధికంగా మూసివేయనున్నారు. సాయి జన్మస్థలం అభివృద్ధిపై రేగిన వివాదమే ఇందుకు కారణం. సాయిబాబా పత్రి అనే గ్రామంలో జన్మించారు. అయితే [more]
షిర్డీ సాయిబాబా ఆలయం రేపటి నుంచి నిరవధికంగా మూసివేయనున్నారు. సాయి జన్మస్థలం అభివృద్ధిపై రేగిన వివాదమే ఇందుకు కారణం. సాయిబాబా పత్రి అనే గ్రామంలో జన్మించారు. అయితే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే పత్రి గ్రామ అభివృద్ధికి వంద కోట్ల రూపాయల నిధులను కేటాయించారు. సాయిబాబా జన్మించిన పత్రిని అభివృద్ధి చేయడం తమ లక్ష్యమని మహారాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. అయితే దీనిని సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ వ్యతిరేకిస్తుంది. షిర్డీని దెబ్బతీసేందుకే ప్రభుత్వం పత్రిని వెలుగులోకి తెచ్చిందని వారు పేర్కొంటున్నారు. సాయిబాబా పన్నెండేళ్ల వయసులోనే షిర్డీకి వచ్చి స్థిరపడ్డారని, ఇక్కడే సమాధి అయ్యారని చెబుతున్నారు. దీంతో నేడు షిర్డీ బంద్ కు పిలుపునిచ్చారు. ఈరోజు షిర్డీ సంస్థాన్ ట్రస్ట్ స్థానికులతో సమావేశం కానుంది. రేపటి నుంచి షిర్డీ ఆలయం మూసివేస్తున్నారని తెలియడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు.