భక్తులకు షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. దీంతో దేవాదాయ శాఖ అప్రమత్తమయింది. అన్ని దేవాలయాల్లో అన్నదానం నిలిపివేయాలని నిర్ణయించింది. సామూహిక భోజనాలను నిషేధించింది. విజయవాడ దుర్గగుడి, [more]
;

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. దీంతో దేవాదాయ శాఖ అప్రమత్తమయింది. అన్ని దేవాలయాల్లో అన్నదానం నిలిపివేయాలని నిర్ణయించింది. సామూహిక భోజనాలను నిషేధించింది. విజయవాడ దుర్గగుడి, ద్వారకా తిరుమల వంటి ప్రముఖ ఆలయాల్లో ఇక అన్నదాన కార్యక్రమం ఉండదు. అయితే కోవిడ్ నిబంధనలను పాటిస్తూ భక్తులకు ప్యాకెట్ల ద్వారా ఉచిత ప్రసాదాలను అందచేయనున్నారు. ఈ భోజన ప్యాకెట్లు ఉదయం పది నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ మాత్రమే అందుబాటులో ఉంటాయని దేవాదాయశాఖ ప్రకటించింది.