తిరుమల శ్రీవారిపై సెకండ్ వేవ్ ఎఫెక్ట్

కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తిరుమల తిరుపతి దేవస్థానంపై పడింది. భక్తుల రద్దీ పూర్తిగా తగ్గిపోయింది. కరోనా కు భయపడి భక్తులు ఎవరూ తిరుమలకు రావడం లేదు. [more]

Update: 2021-05-14 00:35 GMT

కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తిరుమల తిరుపతి దేవస్థానంపై పడింది. భక్తుల రద్దీ పూర్తిగా తగ్గిపోయింది. కరోనా కు భయపడి భక్తులు ఎవరూ తిరుమలకు రావడం లేదు. ఆన్ లైన్ లో దర్శనాలను బుక్ చేసుకున్న వారు సయితం తమ తిరుమల పర్యటనను వాయిదా వేసుకున్నారు. పన్నెండు రోజుల్లో కేవలం 71 వేల మంది భక్తులు మాత్రమే తిరుమలను దర్శించుకున్నారు. తిరుమల చరిత్రలో ఇది అత్యల్పం. పన్నెండు రోజుల్లో కేవలం స్వామివారికి హుండీ ఆదాయం 4.53 కోట్లు మాత్రమే వచ్చింది.

Tags:    

Similar News